నేడే సీఎం లతో ప్రధాని కీలక భేటీ..లాక్ డౌన్ విధిస్తారా??
- January 13, 2022
భారత్‌లో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. ఓ వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. మరోవైపు డెల్టా వేరియంట్ కేసులు భారీగా నమోదు అవుతుండడంతో..ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. ఓవైపు నివారణ చర్యలను పూనుకుంటూనే.. మరోవైపు.. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది.. ఇప్పటికే పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుండగా.. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా ఉద్ధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశానికి సిద్ధం అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగబోతోంది.. ఈ నెల 9వ తేదీన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం కోవివ్ పరిస్థితి, వ్యాక్సినేషన్, ఇతర అంశాలపై కీలకంగా చర్చించిన ప్రధాని మోడీ.. జిల్లా స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని, కరోనాకు చెక్ పెట్టేందుకు టీకానే ఉత్తమ మార్గమని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఇవాళ జరిగే సీఎంలపై భేటీలో.. కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా, భారత్‌లో నిన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 1,94,720కు చేరింది.. మరో 442 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.. ఈ తరుణంలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తర్వాత పెరుగుతున్న కోవిడ్-19 కేసులపై ప్రధాని మోడీ సమావేశం కీలకంగా మారనుంది.. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ మరియు గుజరాత్లో ఆందోళనకర స్థాయిలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు భారీగానే వెలుగుచూస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించడంతో.. రాష్ట్రాలకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వనున్నారు.. కోవిడ్ కట్టడిపై మరింత కఠినంగా వ్యవహరిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







