యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి..రష్యా ప్లాన్..
- January 13, 2022
ఇక యుద్ధం తప్పదా.. ఆ దేశం కోసం అమెరికా రంగంలోకి దిగాల్సిందేనా.. రక్తపాతం జరగాల్సిందేనా ఏమో ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఇదే జరిగేలా కనిపిస్తుంది.
గత కొంత కాలం నుంచి ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యవహరిస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. చైనా తైవాన్ పై కన్నేసి ఆ దేశాన్ని కూడా తమ భూభాగంలో కలిపేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు గానే.. ఇక రష్యా కూడా పొరుగున ఉన్న ఉక్రెయిన్ దేశాన్ని తమ దేశంలో కలుపుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే గతంలో లక్షా 90వేల మంది సైనికులను సరిహద్దుల్లో మొహరించి యుద్ధ విన్యాసాలు చేయించడం హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఈ క్రమంలోనే రష్యా ఉక్రెయిన్ మధ్య ఏక్షణంలోనైనా యుద్ధం తలెత్తే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అయితే ఉక్రెయిన్ ఆక్రమించుకోవాలని రష్యా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అటు అగ్రరాజ్యమైన అమెరికా మాత్రం బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉండటం గమనార్హం. ఉక్రెయిన్ జోలికి వస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఇప్పటికే హెచ్చరించింది అమెరికా. అయినప్పటికీ అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు.
అయితే అటు ఉక్రెయిన్ కి ఆయుధ సహాయం చేసేందుకు కూడా సిద్ధమైన అమెరికా అవసరమైతే యుద్ధ రంగంలోకి దిగాలని కూడా నిర్ణయించుకుందట . అదే సమయంలో మేము స్వతంత్ర దేశంగా ఉండాలా లేక యూరోపియన్ యూనియన్ లో చేరాలా అన్న విషయాన్ని మేమే నిర్ణయించుకుంటాము అంటూ ఉక్రెయిన్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉండడం గమనార్హం. ఇలాంటి సమయంలో ఇక ఇప్పుడు రష్యా మరింత తెగించి నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ చుట్టూ 900 ట్రూప్స్ ఏర్పాటు చేసింది రష్యా. ఇక ఏ క్షణంలోనైనా ఉక్రెయిన్ లోకి ప్రవేశించి స్వాధీనం చేసుకునేందుకు వ్యూహాలను పన్నుతోంది. ఉక్రెయిన్ కి మద్దతుగా ఉన్న అమెరికా లాంటి దేశాలు అప్రమత్తమయ్యే లోపే పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనివ్యూహాలు సిద్ధం చేసిందట రష్యా. ఇక రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది చూడాలి..
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!