కోవిడ్ రూల్స్ పాటించని సంస్థలకు భారీగా ఫైన్

- January 14, 2022 , by Maagulf
కోవిడ్ రూల్స్ పాటించని సంస్థలకు భారీగా ఫైన్

సౌదీ: కొత్త కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని ప్రైవేట్ రంగ సంస్థలను కోరింది. లేదంటే భారీగా జరిమానాలు విధించబడతాయని హెచ్చరించింది. ఎంట్రీ సమయంలో శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేయడం, వ్యాక్సిన్ వేసుకోని లేదా కోవిడ్-పాజిటివ్ వ్యక్తులను అనుమతించడం, సోషల్ డిస్టెన్స్ లేకపోవడం, మాస్కులు పెట్టుకోకపోవడం వంటి కరోనా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నిబంధనలను పాటించని చిన్న సంస్థలకు SR10,000.. పెద్ద వాటికి SR100,000 వరకు జరిమానాలు విధించబడతాయి. ఉల్లంఘనలు పునరావృతం అయితే ఆయా సంస్థలకు SR200,000 వరకు పెనాల్టీతోపాటు ఆరు నెలల మూసివేతను మంత్రిత్వ శాఖ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com