మహిళా నిరసనకారులపై తాలిబాన్ల పెప్పర్ స్ప్రే

- January 17, 2022 , by Maagulf
మహిళా నిరసనకారులపై తాలిబాన్ల పెప్పర్ స్ప్రే

అఫ్ఘానిస్తాన్ రాజధానిలో మహిళా నిరసనాకారులను చెదరగొట్టేందుకు తాలిబాన్లు పెప్పర్ స్ప్రే వినియోగించారు. పని, విద్య లాంటి తమ హక్కులను తిరిగి తమకు కల్పించాలని ఆదివారం ఆందోళన చేపట్టారు.

ఆగష్టు నుంచి దేశం మొత్తాన్ని ఆదీనంలోకి తీసుకున్న తాలిబాన్లు పలు నిబంధనలతో ప్రత్యేకించి మహిళలను కట్టడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కాబుల్ యూనివర్సిటీ ఎదురుగా దాదాపు 20మంది మహిళల గుంపు సమానత్వం, న్యాయం అంటూ నినాదాలు చేస్తూ మహిళా హక్కులు, మానవ హక్కుల బోర్డులతో నిరసన వ్యక్తం చేశారు. కాసేపటి తర్వాత తాలిబాన్ ఫైటర్లు పలు వాహనాల్లో అక్కడికి రాగానే అంతా పరారయ్యారు.

‘కాబూల్ యూనివర్సిటీ దగ్గర్లో ఉండగా మూడు తాలిబాన్ వాహనాలు వచ్చాయి. ఒక వాహనం నుంచి మా మీద పెప్పర్ స్ప్రే చేయడం మొదలుపెట్టారు. కంట్లో పడటంతో సిగ్గులేదా అని గట్టిగా అరిచాను. అంతే అందులో ఒకరు నా మీద గన్ గురి పెట్టారు’ అంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మరో ఇద్దరు మహిళలను హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com