టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్
- January 18, 2022
అమరావతి: ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడ్డారు.తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్న చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు.వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఇటీవల తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు.
కాగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు కూడా సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తన కుమారుడికి కరోనా రావడంతో తనలోనూ తేలికపాటి లక్షణాలు కనిపించడంతో అనుమానం వచ్చి చంద్రబాబు కూడా కరోనా టెస్టులు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది.ప్రస్తుతం చంద్రబాబు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండటంతో ఈరోజు ఏపీ వ్యాప్తంగా జరిగే ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే అవకాశం లేదు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో ఈరోజు నుంచే నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం అమలు చేయనున్న సంగతి విదితమే.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







