భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- January 18, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి.తాజాగా దేశంలో 2,38,018 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.నిన్నటి కేసుల కంటే ఈరోజు 20,071 కేసలు తక్కువగా నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో దేశంలో 1,57,421 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.310 మంది కరోనాతో మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో 17,36,628 పాజిటివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతంగా ఉంది.ఇక ఇదిలా ఉంటే, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 8,891 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8.31 శాతం పెరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.ఒమిక్రాన్ థర్డ్ వేవ్ కారణంగా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడి కోసం అనేక రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు.కొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







