హౌతీ తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్ స్పీకర్
- January 18, 2022
మనామా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబి ఎమిరేట్ పై హౌతీ ఉగ్రవాద డ్రోన్ దాడిని బహ్రెయిన్ ప్రతినిధుల మండలి స్పీకర్ ఫౌజియా బింట్ అబ్దుల్లా జైనల్ తీవ్రంగా ఖండించారు. తీవ్రవాద దాడులు అంతర్జాతీయ మానవతా ఒప్పందాలను, అంతర్జాతీయ సమాజానికి సవాలుగా మారిందన్నారు. ఈ మేరకు ఆమె UAE ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) స్పీకర్ సఖర్ ఘోబాష్‌కి ఒక కేబుల్ పంపారు. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించే ఇలాంటి నేరపూరిత చర్యలను ఖండించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. తన ప్రాదేశిక సమగ్రత, భద్రత, శాంతిని కాపాడేందుకు UAE తీసుకునే అన్ని చర్యలకు బహ్రెయిన్ మద్దతుగా నిలుస్తుందని ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..