జనవరి 24న భారత ఎంబసీ ఓపెన్ హౌస్.!

- January 19, 2022 , by Maagulf
జనవరి 24న భారత ఎంబసీ ఓపెన్ హౌస్.!

కువైట్: భారత ఎంబసీ, భారత రాయబారి శిబి జార్జితో సోమవారం 24 జనవరి 2022న వర్చువల్ ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఓపెన్ హౌస్ ముఖ్య అంశాలు కొత్త పాస్‌పోర్ట్ మరియు కాన్సులర్ ఔట్‌సోర్సింగ్ సెంటర్లు, నర్సుల రిక్రూట్మెంట్, ఒమిక్రాన్ సవాళ్ళపై మీటింగ్ వంటివి. కువైట్‌లోని భారతీయులందరికీ ఈ ఓపెన్ హౌస్‌లో పాల్గొనేందుకు అవకాశం వుంది. ప్రత్యేకమైన వివరాలు కోరేవారు తమ పూర్తి పేరు (పాస్‌పోర్టు మీద వున్నది), పాస్‌పోర్టు నంబర్, సివిల్ ఐడీ నంబర్ మరియు కాంటాక్ట్ నంబర్ అలాగే కువైట్‌లో తమ చిరునామాతో కలిపి [email protected] అనే మెయిల్ అడ్రసుకి ఇ-మెయిల్ చేయాల్సి వుంటుంది. వర్చువల్ పద్ధతిలో మాత్రమే ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు. భౌతికంగా హాజరయ్యేందుకు ఎవరికీ అనుమతి లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com