8 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

- January 20, 2022 , by Maagulf
8 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

ఖతార్: ఖతార్ మిటియరాలజీ డిపార్టుమెంట్ వెల్లడించిన అంచనాల ప్రకారం, ఈ వారం ఖతార్ వాతావరణం మరింత చల్లగా వుండనుంది. ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదయ్యే అవకాశం వుంది. ఈ వింటర్ సీజన్ అత్యంత చల్లదనంతో కూడినదై వుంటుందని అంచనా వేస్తున్నారు. జనవరి 18 నుంచి వారం రోజులపాటు చల్లని వాతావరణం కనిపించనుంది. కాగా, సముద్ర కెరటాలు 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున ఎగసిపడే అవకాశం కూడా వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com