వాహనాలు, భారీ శబ్దాలు: వేలాది మందికి జరిమానా
- January 20, 2022
అబుధాబి: అబుధాబి పోలీస్ విభాగం ఓ వీడియోను విడుదల చేసింది. వాహనాలకు చట్ట వ్యతిరేకంగా మార్పులు చేసి, విపరీతమైన శబ్దాలతో అవి నడిచేలా చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఈ వీడియో ద్వారా అబుధాబి పోలీస్, వాహనదారుల్ని హెచ్చరించడం జరిగింది. 2021లో 2,750 మంది వాహనదారులకు ఈ విషయమై జరిమానాలు విధించినట్లు అబుధాబి పోలీస్ పేర్కొంది. మితిమీరిన శబ్దంతో కూడిన వాహనాలను నడిపేవారికి 2,000 దిర్హాముల జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు విధిస్తారు. ఇంజిన్ లేదా ఛాసిస్ మార్పులు (అనధికారికంగా) చేస్తే 1,000 దిర్హాముల జరీమానా, 12 బ్లాక్ పాయింట్లు విధిస్తారు. వాహనాన్ని 30 రోజులపాటు సీజ్ చేయడం జరుగుతుంది. వాహనాన్ని విడిపించుకునేందుకు 10,000 దిర్హాములు చెల్లించాలి, అది కూడా మూడు నెలల్లోనే జరగాలి. లేనిపక్షంలో వాహనాన్ని వేలంలో విక్రయించేస్తారు. అనవసర శబ్దాలు చేసే వాహనాల వల్ల ఇతర వాహనాల డ్రైవర్లకు, ప్రజలకు ఇబ్బందికరంగా వుంటుంది. పిల్లలు, బాగా పెద్దవారు భయాందోళనకు గురవుతారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







