ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
- January 21, 2022
అమరావతి: పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమవుతుంటే….మరోవైపు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పీఆర్సీ జీవోలకు రాష్ట్రమంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది.కొత్త పీఆర్సీ ప్రకారమే ముందుకెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది.
2022, జనవరి 21వ తేదీ శుక్రవారం ఉదయం కేబినెట్ సమావేశమైంది.ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా పీఆర్సీ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గుతుందని అందరూ ఊహించారు. కానీ..ముందుగా ఇచ్చిన జీవోల ప్రకారమే…వెళ్లాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మరోవైపు…పీఆర్సీ పోరాటాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దానిపై విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు.భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తున్నారు.ఈ సమావేశానికి బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, సూర్య నారాయణరావు హాజరయ్యారు.సమావేశానంతరం మధ్యాహ్నం సీఎస్‌కు సమ్మె నోటీస్ ఇచ్చే అవకాశముంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి