సమతా మూర్తి ని ఫిబ్రవరి 5న ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆవిష్కరణ
- January 21, 2022
హైదరాబాద్: సామాజిక సంస్కరణలకు ఆద్యుడైన రామనుజచార్యుల 1000వ జయంతి సందర్భంగా 216 అడుగుల ‘సమతా మూర్తి’ని ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్నారు. అదే నెల 13న సమతా మూర్తిలోపల గర్భాలయాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు చినజీయర్ స్వామి ఆశ్రమం ఓ ప్రకటనను విడుదల చేసింది. హైదరాబాద్ ముచ్చింతల్ లోని చినజీయర్ ఆశ్రమంలో 45 ఎకరాల విస్తీర్ణంలో సమతా మూర్తిని ఏర్పాటు చేయనున్నారు. ‘‘సమతా మూర్తి ఆవిష్కరణకు అన్ని వర్గాల వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్య అతిథులు, ముఖ్యమైన వ్యక్తులు, భక్తులు, ప్రజలంతా వచ్చి సమతా మూర్తి ఆవిష్కరణను విజయవంతం చేయాలని కోరుతున్నాం. సమానత్వానికి రామానుజచార్యుల వారు వెయ్యేళ్ల పాటు ప్రతీకగా నిలిచారు. ఆయన బోధనలను మరో వెయ్యేళ్ల పాటు జనాలకు తెలియజెప్పేందుకే ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశాం’’ అని చినజీయర్ స్వామి తెలిపారు.
కాగా, కూర్చుని ఉన్న పొజిషన్ లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహంగా సమతా మూర్తి రికార్డుల్లోకి ఎక్కనుంది. కూర్చుని ఉన్న పొజిషన్ లో అతిపెద్ద విగ్రహంగా థాయ్ లాండ్ లోని బుద్ధుడి విగ్రహం పేరిట రికార్డుంది. రామానుజచార్యుల విగ్రహాన్ని బంగారం, వెండి, రాగి, కంచు, జింక్ వంటి పంచలోహాలతో రూపొందించారు. విగ్రహం లోపల గర్భాలయాన్ని 120 కిలోల బంగారంతో నిర్మించారు. భూమిపై ఆయన 120 ఏళ్లు నడయాడినందుకు గుర్తుగా 120 కిలోల బంగారాన్ని వినియోగించారు. ప్రాజెక్టు కోసం రూ.వెయ్యి కోట్లు వెచ్చిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఇచ్చిన విరాళాలు, చందాలతో దానిని నిర్మిస్తున్నారు. 108 దివ్యదేశాలు, 108 విష్ణు ఆలయాలనూ ఇందులో నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!