బహ్రెయిన్: 500 మందికి పైగా భారత వలసదారులు గత ఏడాదిలో మృతి
- January 21, 2022
మనామా: 500 మందికి పైగా భారత వలసదారులు గత ఏడాది కోవిడ్ 19 నేపథ్యంలో తలెత్తిన అనారోగ్య సమస్యలతో బహ్రెయిన్‌లో మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బహ్రెయిన్‌లో వివిధ దేశాలకు చెందినవారు నివసిస్తుండగా, ఇంత పెద్ద సంఖ్యలో మృతి చెందింది భారతీయులేనని తెలుస్తోంది. బహ్రెయిన్‌లో భారత రాయబారి పియుష్ శ్రీవాస్తవ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయడం ఛాలెంజింగ్ టాస్క్ అని ఆయన పేర్కొన్నారు. బహ్రెయినీ అథారిటీస్ ఈ విషయంలో అందిస్తున్న సహకారం మరువలేనిదని ఆయన అన్నారు. మరణానంతర వ్యవహారాల విషయమై పెద్దగా ఇబ్బందులు లేకుండా వాటిని పూర్తి చేయగలిగామంటే అది అథారిటీస్ సహకారంతోనే జరిగిందని చెప్పారు. సామాజిక కార్యకర్త, కేరళ ప్రవాసీ కమిషన్ సభ్యుడు సుబైర్ కన్నుర్ మాట్లాడుతూ, ఇన్నేళ్ళలో ఎప్పుడూ ఈ స్థాయిలో ప్రవాస భారతీయుల మరణాల్ని చూడలేదని అన్నారు. సుమారుగా 510 మంది భారతీయ వలసదారులు కోవిడ్ కారణంగా చనిపోయారు. ఈ సంఖ్యలో సగానికి పైగా మృతదేహాలకు బహ్రెయిన్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాల తరలింపుకు సంబంధించి బహ్రెయిన్ విధి విధానాలు స్పష్టంగా వున్నాయి. మరణం సంభవించగానే, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.హెల్త్ మినిస్ట్రీ, ఇంటీరియర్ మినిస్ట్రీ మరియు ఎంబసీ సహకారం కోసం స్పాన్సరింగ్ కంపెనీ లేఖ విడుదల చేయాలి. ఆ లేఖను సీఐడీ డిపార్టుమెంట్ ముందుంచాలి. తద్వారా డెత్ సర్టిపికెట్ అందుతుంది. మృతదేహాన్ని తరలించేందుకు ఎంబసీ వద్ద రిజిస్టర్ చేసి, నో అబ్జెక్షన్ లెటర్ పొందాలి. ఇమ్మిగ్రేషన్ విభాగం నుంచి ఫైనల్ క్లియరెన్స్ కోసం మార్చురీ నుంచి లేఖ సంపాదించాలి. ఒకవేళ మృతదేహాన్ని తరలించడానికి వీలుకాకపోతే, బుసైతీన్ కనూ మస్జీద్, సల్మాబాద్ సిమిటరీలో లేదా అల్బా క్రిమేషన్ సెంటర్‌లో అంత్యక్రియలు పూర్తి చేస్తారు. రెండేళ్ళ క్రితం నాన్ రెసిడెంట్ కేరలైట్స్ ఎఫైర్స్ రూట్స్, ఎయిర్ ఇండియాతో మృతదేహాల తరలింపు విషయమై అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. కేరళ ప్రభుత్వం కూడా నాన్ రెసిడెంట్ కేరలైట్స్ మృతదేహాలకు సంబంధించి సహాయ సహకారాలు అందిస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..