కువైట్ లో 10 శాతం పెరిగిన ప్రయాణాలు
- January 22, 2022
కువైట్: విదేశాల నుండి వచ్చే వారి కోసం ముందస్తు జాగ్రత్త చర్యల నిబంధనలను సడలించడం, క్వారంటైన్‌ను ముగించడానికి PCR పరీక్ష అందుబాటులో ఉండటం కారణంగా కువైట్ లో సిటిజన్స్, రెసిడెంట్స్ టిక్కెట్ బుకింగ్ లు పెరిగాయి. తప్పనిసరి 72 గంటల నిర్బంధాన్ని రద్దు చేయాలనే గత సోమవారం క్యాబినెట్ నిర్ణయాన్ని అమలు చేయడం వల్ల 10% వరకు బుకింగ్ రేట్లు పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ ఆఫీస్ అధికారులు తెలిపారు. యూరోపియన్ దేశాలు అన్ని ప్రయాణ ఆంక్షలను ముగించడం వంటి అనేక ఇతర అంశాలు కూడా ప్రయాణానికి డిమాండ్ పెరగడానికి దోహదం చేశాయని అధికారులు తెలిపారు. సిటిజన్స్, రెసిడెంట్స్ ప్రయాణానికి డిమాండ్ ఉన్న గమ్యస్థానాల జాబితాలో ఉమ్రా ట్రిప్‌ల డిమాండ్‌తో పాటు టర్కీ, దుబాయ్ ఉన్నాయి. వ్యాక్సిన్లు వేసిన ప్రయాణీకుల కోసం అన్ని ప్రయాణ పరిమితులను తొలగిస్తున్నందున రాబోయే కాలంలో వివిధ యూరోపియన్ దేశాలకు డిమాండ్ పెరుగుతుందని ట్రావెల్ కార్యాలయాలు అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్