50 శాతం సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు

- January 22, 2022 , by Maagulf
50 శాతం సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు

ఒమన్: రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం, ఇతర పబ్లిక్ లీగల్ వ్యక్తుల యూనిట్లలో సిబ్బంది హాజరును మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 50%కి తగ్గించాలని సుప్రీం కమిటీ నిర్ణయించింది. ఇతర ఉద్యోగులు రిమోట్‌గా పని చేయాలని సూచించింది. అన్ని సదస్సులు, ప్రదర్శనల నిర్వహణను వాయిదా వేయాలని సుప్రీం కమిటీ ఆదేశించింది. ప్రత్యేకించి రెస్టారెంట్లు, కేఫ్‌లు, దుకాణాలు, ఈవెంట్ హాళ్లలో 50% సామర్థ్యం మించకుండా ముందు జాగ్రత్త చర్యలకు కట్టుబడి పనిచేయాలని సుప్రీం కమిటీ సంస్థలను కోరింది. వ్యాక్సిన్లు వేయడం, సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. అన్ని కాన్ఫరెన్స్ లు, ఎగ్జిబిషన్‌లు వాయిదా వేయాలని, వ్యాక్సిన్ రుజువుతో సహా పాల్గొనే వారందరికీ తప్పనిసరి నియంత్రణలతో పాటు, పబ్లిక్ స్వభావం గల అన్ని కార్యకలాపాలను కూడా వాయిదా వేయాలి లేదా ప్రేక్షకులు లేనప్పుడు నిర్వహించాలని సూచించింది. ఇకపై శుక్రవారం ప్రార్థనలు నిర్వహించబడవన్నారు. అయితే, రోజువారీ ప్రార్థనలు కొనసాగుతాయని, ఆరాధకుల సంఖ్య వేదిక సామర్థ్యంలో 50% మించకూడదన్నారు. ప్రార్థనలు ఎండోమెంట్స్, మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని సుప్రీం కమిటీ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com