నాగశౌర్య కొత్త సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’!
- January 22, 2022హైదరాబాద్: ఇవాళ యువ కథానాయకుడు నాగశౌర్య పుట్టిన రోజు.ఈ సందర్భంగా అతని సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో తెరకెక్కుతున్న సినిమా పేరును నిర్మాత ఉషా ముల్పూరి ఖరారు చేశారు. అనీశ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘కృష్ణ వ్రింద విహారీ’ అనే పేరు పెట్టారు. కృష్ణ, వ్రింద మధ్య సాగే ప్రణయ ప్రయాణమే ఈ సినిమా. ఈ చిత్రంతో షిర్లే సేతియా కథానాయికా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రాధిక, ‘వెన్నెల’కిశోర్, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ, సత్య తదతరులు ఇందులో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్.
గత యేడాది ద్వితీయార్థంలో నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’ చిత్రాలు విడుదలయ్యాయి. విశేషం ఏమంటే… ఈ రెండు సినిమాలు కూడా జనవరి 6వ తేదీ రెండు వేర్వేరు ఓటీటీలలో ఒకేరోజున స్ట్రీమింగ్ అయ్యాయి. ‘వరుడు కావలెను’లో మెచ్యూర్డ్ లవర్ బోయ్ గా నటించిన నాగశౌర్య, ‘లక్ష్య’ చిత్రంలో విలుకాడి పాత్రను పోషించి, మెప్పించాడు. మరి రాబోయే ‘కృష్ణ వ్రింద విహారి’లో ఏ విధంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటాడో చూడాలి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..