నాగశౌర్య కొత్త సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’!
- January 22, 2022
హైదరాబాద్: ఇవాళ యువ కథానాయకుడు నాగశౌర్య పుట్టిన రోజు.ఈ సందర్భంగా అతని సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో తెరకెక్కుతున్న సినిమా పేరును నిర్మాత ఉషా ముల్పూరి ఖరారు చేశారు. అనీశ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘కృష్ణ వ్రింద విహారీ’ అనే పేరు పెట్టారు. కృష్ణ, వ్రింద మధ్య సాగే ప్రణయ ప్రయాణమే ఈ సినిమా. ఈ చిత్రంతో షిర్లే సేతియా కథానాయికా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రాధిక, ‘వెన్నెల’కిశోర్, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ, సత్య తదతరులు ఇందులో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్.
గత యేడాది ద్వితీయార్థంలో నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’ చిత్రాలు విడుదలయ్యాయి. విశేషం ఏమంటే… ఈ రెండు సినిమాలు కూడా జనవరి 6వ తేదీ రెండు వేర్వేరు ఓటీటీలలో ఒకేరోజున స్ట్రీమింగ్ అయ్యాయి. ‘వరుడు కావలెను’లో మెచ్యూర్డ్ లవర్ బోయ్ గా నటించిన నాగశౌర్య, ‘లక్ష్య’ చిత్రంలో విలుకాడి పాత్రను పోషించి, మెప్పించాడు. మరి రాబోయే ‘కృష్ణ వ్రింద విహారి’లో ఏ విధంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటాడో చూడాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







