ఏప్రిల్ 1న ఖతార్ ఆక్వా పార్క్ ప్రారంభం
- March 28, 2016
ఖతార్ ఆక్వా పార్క్ ఏప్రిల్ 1న యాన్యువల్ సీజన్ కోసం ప్రారంభం కానుంది. నవంబర్ వరకు ఇది కొనసాగుతుంది. తొలి రోజే భారీస్థాయిలో ఆక్వా పార్క్ అందర్నీ ఆకర్షిస్తుందని నిర్వాహకులు అంచనా వేశారు. 50,000 చదరపు మీటర్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఫన్ సెంటర్లో అనేకరకాలైన ఆకర్షణీయాంశాలు ఉన్నాయని ఆక్వా పార్క్ మేనేజ్మెంట్ వెల్లడించింది. వేవ్ పూల్ ఇందులో ప్రధాన ఆకర్షణ అనీ, ఇందులో సిక్స్ ప్యాటర్న్స్ ఉన్నాయనీ, లాగూన్ పూల్‌లో చిల్డ్ జ్యూస్‌తో రిలాక్స్ అవ్వొచ్చనీ, జ్యూస్ బార్, కేఫ్ ఇక్కడ ఉన్నాయని వారు చెప్పారు. నాలుగు లేన్ల వాటర్ స్లైడ్ మరో ప్రధాన ఆకర్షణ. కిడ్స్ పైరేట్ బే చిన్న పిల్లల కోసం ఉంది. ఆఫ్రికన్ విలేజ్‌లో యానిమల్ షేప్డ్ స్లైడ్స్ అలాగే మష్రూమ్ షవర్స్ పిల్లల్ని అమితంగా ఆకర్షించనున్నాయి. బూరమాంగ్, స్పేస్ బోట్, లేజీ రివర్, బంపర్ బోట్స్ మరియు కిడ్స్ డ్రైవింగ్ స్కూల్ ఇందులో ఇతర ప్రధాన ఆకర్షణీయాంశాలు. మినీ మార్కెట్, రెస్ట్ రూమ్స్, 400 లాకర్లను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







