భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ
- January 23, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ కట్టడికి కరోనా ఆంక్షలు విధిస్తున్నా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం కట్టడి కావడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,33,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.శనివారంతో పోలిస్తే స్వల్పంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.తాజాగా 525 మంది మరణించారు.తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,92,37,264కి చేరింది.మొత్తం మరణాల సంఖ్య 4,89,409కి చేరుకుంది.
గడిచిన 24 గంటల్లో 2,59,168 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.దీంతో ప్రస్తుతం 21,87,205 యాక్టివ్ కేసులున్నాయి.దేశంలో డైలీ కరోనా పాజిటివిటీ రేటు 17.78గా నమోదైంది.దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 3,65,60,650కి చేరింది.ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 161.92 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.అలాగే ఇప్పటి వరకు 71.55 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.
తాజా వార్తలు
- యూఏఈ: లైసెన్స్ లేని సంస్థల నుండి గృహ కార్మికులను నియమించుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు
- సీఎం కేసీఆర్తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ