తెలంగాణలో ఆన్ లైన్ తరగతులకు అనుమతి
- January 23, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జనవరి 24 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభం అవుతాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శనివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్ర దశలో ఉన్న నేపథ్యంలో.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంక్రాంతి సెలవులను జనవరి 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీచేసింది. అయితే సిలబస్, పాఠాలు, హాజరుశాతం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆన్ లైన్ తరగతులు నిర్వహించుకునేలా పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ అనుమతులు ఇచ్చింది. ఈక్రమంలో 8, 9, 10 తరగతుల వారికి సోమవారం నుంచి ఆన్ లైన్ తరగతులు నిర్వహించుకోవచ్చని విద్యాశాఖ సంచాలకులు పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ తరగతులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు 50-50(రోజు విడిచి రోజు) ప్రాతిపదికన విధులకు హాజరుకావాలని ఆదేశించారు. కరోనా వ్యాప్తి నిర్ములనలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలోని బోధనేతర సిబ్బంది సైతం సగం మంది ఒకరోజు, మిగిలిన సగం మంది మరుసటి రోజు విధులకు హాజరు అయ్యేలా ప్రణాళికలు వేసుకోవాలని ఆయా పాఠశాలలకు సూచనలు జారీచేశారు. మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను బట్టి.. జనవరి 31 తరువాత అన్ని విద్యాసంస్థలు తెరిచేలా తెలంగాణ విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేశామని, ఈ ఏడాది పరీక్షలు నిర్వహించాకే నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రా రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?