భారత్లో మంకీ ఫీవర్ కలకలం
- January 23, 2022
కర్ణాటక: భారత్లో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఇటీవల ఒక మహిళ జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది.ఆసుపత్రిలో కొన్ని రోజుల పాటు ఆ మహిళకు చికిత్స అందించిన వైద్యులు,ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో పరీక్షలు జరిపారు.అందులో సదరు మహిళకు మంకీ ఫీవర్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.2022లో మొట్టమొదటి మంకీ ఫీవర్ కేసు నమోదు కావడంపై రాష్ట్ర వైద్యశాఖ అప్రమత్తం అయింది.ప్రస్తుతం బాధితురాలికి తీర్థహళ్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మంకీ ఫీవర్ కోతుల నుంచి మనుషులకు సోకె వైరల్ ఇన్ఫెక్షన్ తో కూడిన జబ్బు. దాదాపుగా డెంగీ లక్షణాలు ఉండే ఈ జబ్బులో.. బాధితులు ఎంతకూ తగ్గని జ్వరం, ఒళ్లునొప్పులు వంటి తీవ్ర లక్షణాలతో బాధపడుతుంటారు. దక్షిణాసియా ప్రాంతంలోని కోతుల నుంచి ఇది మనుషులకు సంక్రమించినట్లు గతంలో పరిశోధకులు తేల్చారు.కరోనాకు ముందు రెండేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రంలోనే మంకీ ఫీవర్ కేసులు బయటపడ్డాయి.రాష్ట్రంలోని సాగర్ మండలం అరలగోడు గ్రామంలో అనేక మంది ఈ మంకీ ఫీవర్ భారిన పడగ, దాదాపు 25 మందికి పైగా మృతి చెందారు.అనంతరం ఇటివంటి కేసులు బయటపడలేదు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో మరోసారి మంకీ ఫీవర్ కేసు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది.
తాజా వార్తలు
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?