మీడియా ప్రతినిధిపై నోరుజారిన బైడెన్
- January 25, 2022
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక జర్నలిస్ట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణం గురించి ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై విరుచుకుపడ్డారు.
వైట్ హౌస్‌లో ప్రత్యక్ష ప్రసారం ముగిసిన అనంతరం మీడియా సభ్యులు బయటికి వస్తుండగా ఫాక్స్‌న్యూస్ జర్నలిస్ట్ 'ద్రవ్యోల్బణం రాజకీయ బాధ్యత కాదా' అని అధ్యక్షుడిని ప్రశ్నించారు. దీంతో బైడెన్ మైక్ ఆన్‌లో ఉండగానే అది గొప్ప ఆస్తి అంటూ.. ఆ జర్నలిస్ట్‌ని 'యూ స్టుపిడ్ ....'' అంటూ ఆ తర్వాత ఒక బూతు పదం వాడారు. పక్కనే ఉన్న మీడియా సభ్యులు బైడెన్ ప్రవర్తనతో నిర్ఘాంత పోయారు. అయితే బైడెన్ ఏం అన్నారో అర్థం కాలేదని ఆ జర్నలిస్ట్ పీటర్ డూకీ అన్నారు. అనంతరం డూకీని పిలిచి వ్యక్తిగతంగా తీసుకోవద్దని బైడెన్ సూచించారు. ఫాక్స్ న్యూస్ కన్జర్వేటివ్స్‌కి అనుకూలంగా ఉండే మీడియా కావడంతో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
President Joe Biden was caught on a hot mic calling Fox News reporter Peter Doocy a 'stupid son of a bitch' when pressed about inflation at a White House event pic.twitter.com/OfsSBsXseO
— Reuters (@Reuters) January 25, 2022
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..