ఈ తతంగం అంతా కాదని ఉక్రెయిన్ రష్యా కు తలవంచుతుందా?
- January 25, 2022
ఉక్రెయిన్ సంక్షోభం రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతున్నది. ఉక్రెయిన్ను రష్యా దళాలు ఆక్రమించుకుంటాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నాటో తమ దళాలను ఉక్రెయిన్‌కు అండగా రంగంలోకి దించాయి. ఒకవేళ రష్యా మిలటరీ చర్యలకు పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఉక్రెయిన్‌కు తమ దళాలను పంపిస్తామని అమెరికా చెబుతున్నది. అసలు ఉక్రెయిన్‌లో ఈ సమస్య తలెత్తడానికి కారణం లేకపోలేదు. యూఎస్ఎస్ఆర్ విచ్చిన్నం తరువాత ఉక్రెయిన్ స్వతంత్య్ర దేశంగా ఆవిర్భవించింది. అయితే, ఉక్రెయిన్ పేదరికంలో మగ్గిపోవడంతో 2014లో ఆ దేశ అధ్యక్షుడు విక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. రష్యాతో బంధం పెంచుకోవాలని నిర్ణయించాడు. దీంతో దేశంలో మళ్లీ విప్లవం మొదలైంది.
ఆదేసమయంలో రష్యా ఉక్రెయిన్‌లోని క్రిమిమాను ఆక్రమించింది. ఉక్రెయిన్ యూరప్ లో చేరిపోవాలని నిర్ణయం తీసుకుంది. 2024 వ వరకు యూరప్‌లో చేరాలని నిర్ణయించుకుంది. అయితే, దీనిని రష్యాపూర్తిగా వ్యతిరేకిస్తున్నది. యూరప్ లో చేరిపోవడం కన్నా సంస్కృతి, సంప్రదాయాల పరంగా రష్యాతో కలిసి ఉండాలని పుతిన్ పేర్కొన్నాడు. కానీ, ఉక్రెయిన్ ససేమిరా అనడంతో అప్పటి నుంచి ఈ సంక్షోభం నెలకొన్నది. అయితే, రష్యా ఉక్రెయిన్ను ఆక్రమించుకుంటే ఆంక్షలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కాదని వదిలేస్తే తన పరపతి తగ్గిపోతుంది. అందుకే ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చి తనంతట తానుగా లొంగిపోయేందుకు రష్యాపావులు కదుపుతున్నది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..