ముత్రహా లో 136 కిలోల అన్ ఫిట్ ఫుడ్ ధ్వంసం
- January 28, 2022
మస్కట్: ముత్రహాలోని కేఫ్‌లు, రెస్టారెంట్‌లలో మస్కట్ మునిసిపాలిటీ దాడులు చేసింది. ఈ సందర్భంగా దాదాపు 136కిలోల అన్ ఫిట్ ఫుడ్(నిబంధనల ప్రకారం లేని) ను అధికారులు ధ్వంసం చేశారు. అలాగే ఫుడ్ తయారీకి అనుకూలంగా లేని 13 టూల్స్ ని సీజ్ చేసింది. తనిఖీల్లో భాగంగా తరచూగా ఫ్లోర్ క్లినింగ్, సరైన వెంటిలేషన్, ఫిజికల్ డిస్టెన్స్ (కనీసం రెండు మీటర్లు) పాటించడం,ప్రతి కార్మికుడు/ఉద్యోగికి తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలను అందించడం వంటి చర్యలకు అందరూ కట్టుబడి ఉండాలని మున్సిపాలిటీ అధికారులు స్పష్టం చేశారు. COVID-19 మహమ్మారి నియంత్రణలో భాగంగా సుప్రీం కమిటీ చట్టాలు, నిర్ణయాలు లేదా సిఫార్సులకు అనుగుణంగా చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా అమలు అయ్యేలా చూస్తామని మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. ప్రజారోగ్య పరిరక్షణకు అందరూ కలిసి రావాలని, సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 1111కి కాల్ చేసిన నివృతి చేసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!