తీవ్రవాద నేరంపై 11 మందికి జీవిత ఖైదు
- March 28, 2016
యూఏఈలో ఉన్నత న్యాయస్థానం 11 మందికి జీవిత ఖైదు విధించింది. అబుదాబీలోని ఫెడరల్ కోర్ట్ మరో ఇద్దరికి 15 సంవత్సరాలు, 13 మందికి 10 ఏళ్ళు, ఆరుగురికి మూడేళ్ళు, ఇద్దరికి ఐదేళ్ళు జైలు శిక్ష విధించారు. ఏడుగురిని నిర్దోషులుగా తేల్చింది న్యాయస్థానం. 41 మందిపై నేరాభియోగాలు మోపబడ్డాయి. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న కేసులో వీరిపై కేసులు నమోదయ్యాయి. ఆగస్ట్‌లో వీరి అరెస్ట్ జరిగింది. దేశంలో విధ్వంసాలు సృష్టించడం, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడం, నిషేధిత మారణాయుధాల్ని వినియోగించడం తదితర అభియోగాల్ని నమోదు చేసి, నిందితుల్ని దోషులుగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









