వెల్లుల్లితో బరువు తగ్గడం చాలా సులువు

- January 30, 2022 , by Maagulf
వెల్లుల్లితో బరువు తగ్గడం చాలా సులువు

మన రోజువారి ఆహారంలో వెల్లుల్లిని ఉపయోగించడం ద్వారా అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, రోగ నిరోధక శక్తి, అకాల వృద్ధాప్య నివారణా తత్వాలతో పాటు, రక్తనాళాల నష్టం వంటి సమస్యల నుండి కాపాడగలిగే పోషక తత్వాలు ఎక్కువగా ఉన్నాయి. గుండె జబ్బు, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషించగలదు. 

ముఖ్యంగా వెల్లుల్లి ద్వారా మన శరీరంలోని కొవ్వును కరిగించి బరువు తగ్గించుకోవడం చాలా సులభం. వెల్లుల్లిలో విటమిన్ బి 6, విటమిన్ సి, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్ మరియు చక్కెర ఉన్నాయి. దీన్ని బరువు తగ్గడానికి ఎలా ఉపయోగించాలో ఇక్కడ మనం తెలుసుకుందాం.
 

  • పరగడుపునే ఖాళీ కడుపుతో తురిమిన వెల్లుల్లి రెబ్బలను తేనెతో కలిపి తీసుకోవడం మూలముగా ఉత్తమ ప్రయోజనాలను పొందగలరు. ఈ చిట్కా రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, బరువు తగ్గడంలో, మరియు శరీరాన్ని బలంగా ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడగలదు. ఆయుర్వేదంలో వెల్లుల్లికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కూడా.
  • వెల్లుల్లి మరియు నిమ్మరసం వెల్లుల్లి నిమ్మరసంతో కలిపి తినవచ్చు. ఒక కప్పు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి మరియు అందులోనే ఒక వెల్లుల్లిని కచపచ దంచి ఆ నీటిలో జోడించండి.నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిమ్మరసం మరియు వెల్లుల్లి మీ బరువు తగ్గడానికి సహాయపడతాయి. బరువు తగ్గడానికి మీరు వెల్లుల్లిని ఉపయోగించే ముందు డైటీషియన్ నుంచి సలహా పొందండి. వెల్లుల్లిని అతిగా తినడం కూడా మంచిది కాదు. రోజుకు ఒకటి, రెండు మాత్రమే ఉపయోగించాలి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com