TPS ఖతార్ నిర్వహించిన రక్తదాన శిబిరం

- January 30, 2022 , by Maagulf
TPS ఖతార్ నిర్వహించిన రక్తదాన శిబిరం

దోహా: భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రజా సమితి ఖతార్ జనవరి 28న(శుక్రవారం) హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) బ్లడ్ డోనర్ సెంటర్ టీమ్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది.దోహాలోని హమద్ రక్తదాన కేంద్రంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం జరిగింది.రిజిస్ట్రేషన్ పాయింట్ నుండి హెల్త్ చెక్ క్లియరెన్స్, బ్లడ్ డ్రాయింగ్ మరియు అప్రిసియేషన్ సర్టిఫికేట్ల జారీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, ఐసీసీ అధ్యక్షుడు బాబురాజన్, ఐసీసీ జనరల్ సెక్రటరీ కృష్ణకుమార్, ఐసీసీ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ పర్సన్ కే.ఎస్ ప్రసాద్, ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

రక్తదాతలందరూ భారత రాయబారి మరియు ఐసిసి అధ్యక్షుడు బాబురాజన్ మరియు వేదిక వద్ద ఉన్న ఇతర ప్రముఖుల నుండి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.రక్తదాన శిబిరంలో పాల్గొన్నందుకు టిపిఎస్ టీం, హెచ్ఎంసి సిబ్బంది, యాజమాన్యం మరియు ప్రవాస భారతీయులకు డాక్టర్ మిట్టల్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ శిబిరాన్ని గద్దె శ్రీనివాస్ ఆధ్వర్యంలో  తెలంగాణ ప్రజా సమితి ఖతార్ వారు రూపొందించారు మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు TPS బృందానికి మరియు QNTO మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు.సలహా సంఘం చైర్మన్ చెన్నవనేని తిరుపతి మరియు సభ్యులు కూడా పాల్గొన్నారు.రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సేవకులందరికీ TPS ఖతార్ ప్రధాన కార్యదర్శి వెంకట్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com