కోవిడ్-19 కోలుకున్న వారికి బూస్టర్ డోస్
- January 31, 2022
ఖతార్: కోవిడ్-19 కోలుకున్న రోగులకు బూస్టర్ డోస్ ఇవ్వడంపై పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ (MoPH) స్పష్టతనిచ్చింది. కరోనా పాటిజివ్ వచ్చిన వ్యక్తులు ఇన్‌ఫెక్షన్ తేదీ నుండి మూడు నెలలు పూర్తయిన తర్వాత బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులని మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో ఇన్ఫెక్షన్ వచ్చిన ఒక నెల తర్వాత కూడా ఎవరైనా బూస్టర్ డోస్ తీసుకోవాలనుకుంటే అనుమతిస్తామని పేర్కొంది. ఇప్పటివరకు ఖతార్‌లో 5,777,396 వ్యాక్సినేషన్ డోసులు అందించారు. వాటిలో 780,609 బూస్టర్ డోస్‌లు ఉన్నాయి. ఖతార్‌లోని జనాభాలో దాదాపు 86.9% మందికి రెండు డోస్‌ల వ్యాక్సిన్లు వేసినట్లు పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. కోవిడ్-19 బూస్టర్ డోస్‌లు, అన్ని ఇతర వ్యాక్సినేషన్ డోసులు బు గార్న్ లోని ఖతార్ వ్యాక్సినేషన్ సెంటర్ (QVC), లుసైల్ నగరంలో డ్రైవ్-ఇన్‌తో పాటు మొత్తం 28 ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో (PHCCలు) అందిస్తున్నారు. వ్యాపార సంస్థలు [email protected]కి ఇమెయిల్ చేస్తే వారివద్ద పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు వ్యాక్సిన్ డ్రైవ్ చేపడతామని పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..