‘సీఎస్ఐ సనాతన్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల
- January 31, 2022
హైదరాబాద్: ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సీఎస్ఐ సనాతన్’. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్ ఐ) ఆఫీసర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.
శివశంకర్ దేవ్ దర్శకత్వంలో అజయ్ శ్రీనివాస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఒక బిల్డింగ్ లో జరిగిన హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కోసం హీరో తన టీమ్ తో రావడం చూపించారు.క్రైమ్ జరిగిన ప్రాంతంలో పిస్టల్, కత్తి, కళ్లద్దాలు, ఫింగర్ ప్రింట్స్, బాడీ పడిఉన్న డ్రాయింగ్…ఇలా పలు ఆధారాలు ఉన్నాయి. ఈ క్లూస్ తో నేరస్థులను హీరో ఎలా పట్టుకోబోతున్నాడు? అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. చిత్రీకరణ తుది దశకు చేరుకుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తాకర్ పొన్నప్ప ,మధు సూదన్, వాసంతి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు అనీష్ సోలోమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!