భారత్లో కరోనా కేసుల వివరాలు
- February 01, 2022
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా మరణాలు ఒక్కరోజులో వేయికి పైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఒక వైపు కరోనా కేసులు దిగొస్తుండగా.. మరణాల సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. సోమ-మంగళ వారాల మధ్య దేశంలో కొత్తగా 1,67,059 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అంతకముందు రోజుతో పోలిస్తే 20 శాతం మేర కేసుల సంఖ్య పడిపోయింది. ఈమేరకు మంగళవారం విడుదల చేసిన Covid -19 హెల్త్ బులెటిన్ లో కేంద్ర ఆరోగ్యశాఖ వివరాలు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1192 మంది మహమ్మారి భారిన పడి మృతి చెందారు. దింతో ఇప్పటివరకు భారత్ లో కరోనా భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4,96,242 కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 17,43,059 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక రోజువారీ పాజిటివిటీ 11.69% శాతానికి చేరుకోగా.. వారాంతపు పాజిటివిటీ రేటు 15.25% శాతానికి పడిపోయింది.
సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల మధ్య 2,54,076 మంది మహమ్మారి నుంచి కోలుకోగా మొత్తం ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,92,30,198కు చేరింది. దేశంలో రికవరీ రేటు 94.60% శాతానికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 14,28,672 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు మొత్తం 73.06 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేపట్టారు. దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ పంపిణీ కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు దేశ వ్యాప్తంగా 166.68 కోట్ల వాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ప్రజలు వాక్సిన్ తీసుకోవాలని, ప్రభుత్వ సూచన మేరకు ఆవసరమైతే బూస్టర్ డోసు కూడా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!