హౌతీ దాడుల్లో చనిపోయిన ఇండియన్స్ కుటుంబ సభ్యులకు జాబ్స్

- February 02, 2022 , by Maagulf
హౌతీ దాడుల్లో చనిపోయిన ఇండియన్స్ కుటుంబ సభ్యులకు జాబ్స్

యూఏఈ: హౌతీ దాడుల్లో చనిపోయిన ఇద్దరు భారతీయుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, వారి పిల్లల చదువులకు ఆర్థిక సాయం చేసేందుకు అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) ముందుకొచ్చింది. ఈ మేరకు యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ తెలిపారు. ADNOCలో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ డ్రైవర్లు హర్దీప్ సింగ్, హర్దేవ్ సింగ్ జనవరి 17న ముస్సాఫాలోని పారిశ్రామిక ప్రాంతంలో ADNOC పెట్రోలియం ట్యాంకర్ల పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో ఒక పాకిస్థానీ ప్రవాసుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సందర్భంగా రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబసభ్యులకు నిరంతరం అవసరమైన సాయాన్ని ADNOC, యూఏఈ  ప్రభుత్వం అందజేస్తుందన్నారు. రవాణా ఖర్చులు, జీత పరిహారం, ప్రయోజనాలను వేగంగా అందించాయని తెలిపారు. అలాగే గాయపడ్డ ఇద్దరు భారతీయులు రంజాన్ మహ్మద్ రాత్, రామ్ సింగ్ శర్వణన్ లకు మెరుగైన వైద్య సేవలతోపాటు వారి కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ADNOC అందిస్తోందని సుధీర్ ప్రశంసించారు. యూఏఈ సురక్షిత దేశాల్లో ఒకటని, ఇక్కడ భారతీయులు గతంలో వలే నిశ్చింతగా పనిచేసుకోవాలని ఆయన సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com