గ్లోబల్ అవార్డును గెలుచుకున్న ‘అల్ హోస్న్’ యాప్

- February 02, 2022 , by Maagulf
గ్లోబల్ అవార్డును గెలుచుకున్న ‘అల్ హోస్న్’ యాప్

యూఏఈ: యూఎస్ ఆధారిత గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ (GEA)ను యూఏఈ అధికారిక కోవిడ్-19 అల్ హోస్న్ యాప్ గెలుచుకుంది. మెరుగైన సేవల విభాగంలో ‘యాప్ ఆఫ్ ది ఇయర్ 2021’ గా నిలిచింది. యూఏఈ ఆరోగ్య వ్యవస్థ అధునాతన స్థాయిని, కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ఈ యాప్ ను రూపొందించారు. కోవిడ్-19 పీసీఆర్ పరీక్షలు, వ్యాక్సిన్, వ్యాక్సిన్ మినహాయింపుల స్థితి లాంటి డేటాను మెయింటన్ చేస్తోంది. ఈ యాప్ మూడు భాషలలో అందుబాటులో ఉంది. నేషనల్ క్లౌడ్‌లో హోస్ట్ చేస్తున్న ఈ యాప్.. అత్యధిక భద్రత, డేటా గోప్యత సర్టిఫికేట్‌లను కలిగి ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com