ఐదేళ్లలోపు చిన్నారులకు త్వరలోనే ఫైజర్ వ్యాక్సిన్
- February 02, 2022
అమెరికా: ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ వేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆరు నెలల పసికందు నుంచి నాలుగేళ్ల చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ-ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసుకుంది ఫైజర్. తమ కరోనా వ్యాక్సిన్ కు ఇచ్చిన అత్యవసర వినియోగ అనుమతిని సవరించి 6నెలల పసికందు నుంచి నాలుగేళ్లలోపు చిన్నారులను కూడా చేర్చాలని ఎఫ్‌డీఏను కోరినట్లు ఫైజర్ తెలిపింది. ఎఫ్‌డీఏ అనుమతి లభిస్తే చిన్నారులకు అందుబాటులోకి వచ్చిన తొలిటీకాగా ఫైజర్ నిలవనుంది.
కరోనా కారణంగా అమెరికాలో ఆస్పత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరిగిందని ఫైజర్ తెలిపింది. భవిష్యత్ వేరియంట్లను ఎదుర్కొనటంతో పాటు వైరస్ నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడుకునేందుకు ఎఫ్‌డీఏతో కలిసి పని చేస్తున్నట్లు ఫైజర్ పేర్కొంది.ఆరు నెలల చిన్నారులకు ఇచ్చే వ్యాక్సిన్.. పెద్దలకు ఇచ్చే దానిలో పదో వంతు మాత్రమే ఉంటుందని ఫైజర్ తెలిపింది. ఇది దేశంలో పాఠశాలలకు వెళ్లని సుమారు కోటి 90 లక్షల చిన్నారుల కోసం రూపొందించినట్లు సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







