'గ్రేస్ పీరియడ్'లో ఖతార్ నుంచి వెళ్లేందుకు 10 రోజుల గడువు

- February 04, 2022 , by Maagulf
\'గ్రేస్ పీరియడ్\'లో ఖతార్ నుంచి వెళ్లేందుకు 10 రోజుల గడువు

ఖతార్: 'గ్రేస్ పీరియడ్' సమయంలో దేశం నుంచి తిరిగి వెళ్లేందుకు ట్రావెల్ అనుమతి పొందిన వర్కర్స్ 10 రోజుల్లోపు బయలుదేరాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI)  స్పష్టం చేసింది. కొత్త లేబర్ చట్టాల ప్రకారం.. ఖతార్ లో 18 ఏండ్లలోపు వర్కర్స్ ని నిషేధించారు. దాంతో అక్టోబరు 10, 2021 నుండి మార్చి 31, 2022 వరకు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్లను ఆయా కంపెనీలు తొలగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మైనర్ వర్కర్స్ పై ఎలాంటి దేశ బహిష్కరణ వేటు వేయకుండానే స్వచ్ఛందంగా ఖతార్‌కు విడిచి వెళ్లేందుకు మంత్రిత్వ శాఖ మార్చి 31 వరకు ‘గ్రేస్ పీరియడ్’ విధించింది. ఈ సమయంలోపు తామంత తాముగా ముందుకు వచ్చే కంపెనీలకు చట్టపరమైన జరిమానాల నుంచి మినహాయింపులు కల్పించనున్నారు. ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీలు నిర్ణీత గడువులోపు వర్కర్స్ కు సెటిల్ చేయడంతోపాటు సంబంధిత విభాగానికి డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన వెబ్‌నార్‌లో మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com