'గ్రేస్ పీరియడ్'లో ఖతార్ నుంచి వెళ్లేందుకు 10 రోజుల గడువు
- February 04, 2022
ఖతార్: 'గ్రేస్ పీరియడ్' సమయంలో దేశం నుంచి తిరిగి వెళ్లేందుకు ట్రావెల్ అనుమతి పొందిన వర్కర్స్ 10 రోజుల్లోపు బయలుదేరాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) స్పష్టం చేసింది. కొత్త లేబర్ చట్టాల ప్రకారం.. ఖతార్ లో 18 ఏండ్లలోపు వర్కర్స్ ని నిషేధించారు. దాంతో అక్టోబరు 10, 2021 నుండి మార్చి 31, 2022 వరకు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్లను ఆయా కంపెనీలు తొలగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మైనర్ వర్కర్స్ పై ఎలాంటి దేశ బహిష్కరణ వేటు వేయకుండానే స్వచ్ఛందంగా ఖతార్‌కు విడిచి వెళ్లేందుకు మంత్రిత్వ శాఖ మార్చి 31 వరకు ‘గ్రేస్ పీరియడ్’ విధించింది. ఈ సమయంలోపు తామంత తాముగా ముందుకు వచ్చే కంపెనీలకు చట్టపరమైన జరిమానాల నుంచి మినహాయింపులు కల్పించనున్నారు. ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీలు నిర్ణీత గడువులోపు వర్కర్స్ కు సెటిల్ చేయడంతోపాటు సంబంధిత విభాగానికి డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ నిర్వహించిన వెబ్‌నార్‌లో మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ వెల్లడించారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!