గంటకు 2,600 మైళ్ల వేగం..హైస్పీడ్ విమానాల కోసం చైనా ప్రయోగం
- February 04, 2022
బీజింగ్: చైనా గత ఏడాది గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే మాగ్లెవ్ హైస్పీడ్ రైళ్లను తయారుచేసి రికార్డు సృష్టించిన చైనా, ఇప్పుడు సూపర్ సోనిక్ స్పీడ్ తో దూసుకెళ్లే అత్యాధునిక విమానాల అభివృద్ధిపై దృష్టి సారించింది. చైనాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ ‘స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్’ హైస్పీడ్ విమానాలను రూపొందించింది. వీటిని టియాంగ్జింగ్-1, టియాంగ్జింగ్-2 అని పిలుస్తారు. ఇవి ప్రస్తుతమున్న జెట్ విమానాల కంటే 6 రెట్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ సూపర్ సోనిక్ విమానాల వేగం గంటకు 2,600 మైళ్లు! ఆ లెక్కన బీజింగ్ నుంచి అమెరికా నగరం న్యూయార్క్ కు గంటలో ప్రయాణించవచ్చు. ఈ విమానాల్లో రాకెట్లలో వాడే ఇంజిన్లు వాడతారని తెలుస్తోంది. ఇప్పటికే పలు పరీక్షలు నిర్వహించిన స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ సంస్థ, 2024 నాటికి ఈ సూపర్ సోనిక్ విమానాలను పూర్తిస్థాయిలో పరీక్షించాలని భావిస్తోంది. ఇక సిబ్బందితో జరిపే పరీక్షలను 2025లో నిర్వహిస్తుందట.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!
- నవంబర్ లో ఫ్లైట్స్ రేట్స్ డ్రాప్..!!
- పాఠశాల క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీపై ఖతార్ వార్నింగ్..!!
- మానవ అక్రమ రవాణాపై కువైట్ ఉక్కుపాదం..!!
- ఇజ్రాయెల్ నిర్బంధించిన పౌరులపై బహ్రెయిన్ ఆరా..!!
- హైల్ మసాజ్ పార్లర్లో అనైతిక చర్యలు..!!
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు