అల్ హోస్న్ యాప్‌లో గ్రీన్ స్టేటస్ కోసం పీసీఆర్ టెస్ట్ అవసరంలేదు

- February 04, 2022 , by Maagulf
అల్ హోస్న్ యాప్‌లో గ్రీన్ స్టేటస్ కోసం పీసీఆర్ టెస్ట్ అవసరంలేదు

యూఏఈ: పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన అబుధాబి నివాసితులు ఇకపై అల్ హోస్న్ యాప్‌లో గ్రీన్ స్టేటస్ కోసం పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. పది రోజుల పాటు క్వారంటైన్లో వుంటే, గ్రీన్ స్టేటస్ 11వ రోజున వస్తుందనీ, గ్రీన్ కోడ్ 30 రోజులపాటు కొనసాగుతుందని యాప్ ఇన్ఫో పేజ్ వెల్లడిస్తోంది. తర్వాతి 60 రోజుల్లో ప్రతి 14 రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ తీసుకోవాల్సి వుంటుంది. కోవిడ్ 19 పాజిటివ్ వచ్చాక, రెండు నెగెటివ్ పీసీఆర్ టెస్టులు 24 గంటల్లో పొందినవి వుంటే తప్ప గ్రీన్ స్టేటస్ లభించేది కాదు.. ఒకవేళ వారు పూర్తిగా వ్యాక్సినేటెడ్ అయినా. కాగా, కోవిడ్ పాజిటివ్ వచ్చినవారికి వ్యాక్సిన్ లేదా బూస్టర్ డోసు 90 రోజుల వరకు అవసరం వుండదు.ఇంటిగ్రేటెడ్ ట్రావెల్ పాసుకి కూడా ఇది వర్తిస్తుంది. గ్రీన్ పాస్ కొనసాగించడానికి ప్రతి 14 రోజులకు ఓ సారి పిసిఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఇతరులని రక్షించండి.. అనే నినాదంతో, అవగాహనా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. కోవిడ్ సోకినవారు ఐసోలేషన్‌లో వుండడం ద్వారా ఇతరులకు ఆ వైరస్ సోకకుండా వుంటుంది.  అబుధాబిలోకి ప్రవేశించేందు కోసం అల్ హోస్న్ యాప్‌లో గ్రీన్ పాస్ తప్పనిసరి. అన్ని ఫెడరల్, స్థానిక ప్రభుత్వ శాఖల కార్యాయాల్లోకి అలాగే పబ్లిక్ స్కూళ్ళు, కాలేజీల్లోకి ప్రవేశించేందుకు కోవిడ్ సేఫ్టీ పాస్ వుండాలి. పూర్తి వ్యాక్సినేషన్ పొందినవారికి నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ రిజల్టు ద్వార 14 రోజుల తర్వాత గ్రీన్ స్టేటస్ యాక్టివేట్ అవుతుంది. ప్రతి 14 రోజులకు ఇది గ్రే స్టేటస్ అవుతుంది.. ఒకవేళ కోవిడ్ 19 సర్టిఫికెట్ గనుక తీసుకోకపోతే. రెండో డోసు తర్వాత ఆరు నెలలకు బూస్టర్ డోసు తీసుకుంటేనే వారు పూర్తి వ్యాక్సినేషన్ పొందినవారవుతారు. బూస్టర్ డోస్ పొందేందుకు నెల రోజుల గ్రేస్ పీరియడ్ కూడా వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com