కోవిడ్ 19: ఆరు గల్ఫ్ దేశాల నుంచి 700,000 మంది భారతీయులు స్వదేశానికి

- February 05, 2022 , by Maagulf
కోవిడ్ 19: ఆరు గల్ఫ్ దేశాల నుంచి 700,000 మంది భారతీయులు స్వదేశానికి

కువైట్: కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో ఆరు గల్ఫ్ దేశాల నుంచి 700,000 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్ళినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారత ప్రభుత్వం ఈ మేరకు గణాంకాల్ని విడుదల చేసింది. మొత్తంగా 716,662 మంది కార్మికులు భారతదేశానికి తిరిగి వచ్చారు. వీరిలో దాదాపు సగం మంది (330,058) యూఏఈ నుంచి వచ్చినవారే. సౌదీ అరేబియా (137,900), కువైట్ (97,802), ఒమన్ (72,259) ఆ తర్వాతి స్థానంలో వున్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ విషయాల్ని పార్లమెంటు సమావేశాల్లో వెల్లడించారు. స్వదేశానికి తిరిగి వచ్చినవారిని ఆదుకోవడంతోపాటు, కోవిడ్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయినవారికి తగిన సాయం అందించేందుకు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు భారత ప్రభుత్వం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com