రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
- February 05, 2022
హైదరాబాద్: ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. రామానుజ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. 120 కిలోల స్వర్ణ శ్రీమూర్తికి ప్రధాని మోదీ పూజలు నిర్వహించారు. అనంతరం రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. అంతకుముందు ముచ్చంతల్లోని యాగశాలలో ప్రధాని మోదీ ప్రధాని పూజలు చేశారు. తిరునామం, పట్టు వస్త్రాల్లో వచ్చిన మోదీ వేద పండితుల్ని అనుకరించారు. ప్రధానిమోదీతో రుత్వికులు సంకల్పం చేయించారు. చినజీయర్ స్వామి ఇచ్చిన కంకణాన్ని మోదీ ధరించారు. అనంతరం సమతామూర్తి విగ్రహ ప్రాంగనానికి మోదీ చేరుకున్నారు. సమతాస్ఫూర్తి కేంద్రంలో 108 దివ్య దేశాలను సందర్శించారు. 108 దివ్య దేశాల విశిష్టతను చినజీయర్ స్వామి ప్రధానికి వివరించారు. రామానుజ జీవిత చరిత్ర విశేషాల గ్యాలరీని సందర్శించారు. రాత్రి 8.25 గంటలకు ఢిల్లీకి ప్రధాని మోదీ తిరుగు ప్రయాణం అవుతారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!