పద్మశ్రీ పద్మజారెడ్డి కి తెలుగు కళాసమితి ఘన సత్కారం
- February 05, 2022
హైదరాబాద్: దశాబ్దాల తరబడి జీవితాన్ని కూచిపూడి నాట్యానికి చిత్తశుద్ధితో అంకితం చేసిన యోగిని, తపస్విని డాక్టర్ పద్మజా రెడ్డి అని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎల్.వి.గంగాధర్ శాస్త్రి అభినందించారు.తెలుగు కళా సమితి,దోహా-ఖతార్ ఆధ్వర్యంలో శనివారం జింఖానా క్లబ్ లో పద్మశ్రీ పురస్కార ప్రకటిత డాక్టర్ పద్మజా రెడ్డి కి ఆత్మీయ అభినందన సత్కారం వైభంగా జరిగింది.ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎల్.వి.గంగాధర శాస్త్రి మాట్లాడుతూ కళా రంగానికి జీవితం అంకితం చేయడం లో శాశ్వత ఆనందం ఉందన్నారు. నాట్యం అభ్యసించి పరిశోధించి విశ్వ విఖ్యాతమై మహోన్నత లక్ష్యం తో ఎందరినో తీర్చిదిద్దిన పద్మజా రెడ్డి కి పద్మశ్రీ లభించడం సముచితం ఔన్నత్యం అని, తెలుగు జాతికి గర్వకారణం అని ప్రశంసించారు. డాక్టర్ పద్మజా రెడ్డి స్పందిస్తూ ఐదు దశాబ్దాల తన కృషి ఫలించిందని, కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రతిష్టాత్మక పద్మశ్రీ ప్రకటించడం జన్మ ధన్యమైనదని సంతోషం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింతగా పెంచిందని, గురువు దివంగత శోభానాయుడుకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు కళాసమితి అధ్యక్షులు ఉసిరికల తాతాజీ అధ్యక్షత వహించిన సభలో సీనియర్ పాత్రికేయులు ఎ.ప్రభు,డాక్టర్ మహ్మద్ రఫీ, మాధవి సిద్ధం, అమెరికా ఆటా ప్రతినిధులు కె.సత్యనారాయణ రెడ్డి, జి.రామచంద్రారెడ్డి, కథక్ పండిట్ అంజుబాబు,కలయిక నారాయణ తదితరులు పాల్గొన్నారు.దయా హాస్పిటల్స్ డైరెక్టర్ వి.ఆర్.ఆర్.పద్మజ, డాక్టర్ మహ్మద్ రఫీ పర్యవేక్షించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!