తెలంగాణ కరోనా అప్డేట్
- February 05, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. క్రమంగా కొత్త కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,098 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,76,313కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు.దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,099కి పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలోనే కరోనా బారి నుంచి 3వేల 801 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29వేల 226 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 629 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 74వేల 083 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. శుక్రవారంతో(2,387) పోలిస్తే కొత్త కేసులు కాస్త తగ్గాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!