తెలంగాణలో పెరుగుతున్న చలి
- February 06, 2022
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు చలి మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తూర్పు ఈశాన్య దిశల నుంచి రాష్ట్రంలోకి శీతల గాలులు వీస్తున్నాయని….వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో రాత్రి ఉష్ణో గ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశంఉన్నట్లు తెలిపారు.రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కాగా, రాష్ట్రంలో నిన్న అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. మెదక్‌లో 11.5 డిగ్రీలు, రామగుండంలో 11.6 డిగ్రీలు, హన్మకొండలో 12.5 డిగ్రీలు, దుండిగల్‌లో 13.6 డిగ్రీలు, హైదరాబాద్‌లో 13 డిగ్రీలు, నిజామాబాద్‌లో 13.7 డిగ్రీలు, హకీంపేట్‌లో 14.7 డిగ్రీలు, భద్రాచలంలో 15.2 డిగ్రీలు, ఖమ్మంలో 15.4 డిగ్రీలు, నల్లగొండలో 16 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..