బోరుబావిలో పడిన బాలుడు...మృతి
- February 06, 2022
మొరాకో: మొరాకోలోని ఇఘ్రాన్ గ్రామంలో ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 32 మీటర్ల లోతైన బోరు బావిలో పడిపోయాడు ఐదేళ్ల బాలుడు రయాన్ అవ్రామ్. కాగా సాయంత్రం అయినా పిల్లాడు ఇంటికి రాకపోవడంతో తప్పిపోయాడేమోనని అంతా వెతికారు ఇంటి సభ్యులు. కాగా సమీపంలోని బోరు బావి నుంచి కేకలు వినిపిస్తుండటంతో అప్రమత్తమైన స్థానికులు.. వారి తల్లిదండ్రులను పిలిచారు. లైట్లు వేసి చూశారు. తనను పైకి లాగాలంటూ ఆ చిన్నారి ఆర్తనాదాలు చేశాడు..వెంటనే అధికారులకు సమాచారమివ్వగా వారొచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఐదు రోజుల పాటు ఆపరేషన్ సాగింది. పిల్లాడికి గొట్టం ద్వారా తిండి, నీళ్లు, ఆక్సిజన్ పంపించారు. పిల్లాడిని బతికించేందుకు బోరుబావికి సమాంతరంగా అధికారులు సొరంగం తవ్వి బాలుడు పడిన చోటుకు చేరుకున్నారు. అయినా పిల్లాడిని బతికించలేకపోయారు. విగత జీవిగా మారిన తమ బిడ్డను చేతుల్లోకి తీసుకుని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.ఈ సంఘటన మొరాకోలోని షెప్షావూలో చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి తెలిసి మొరాకో రాజు మహ్మద్ VI మరణించిన బాలుడి కుటుంబానికి సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్