FIFA ప్రపంచ కప్ 2022.. సిద్ధమైన లుసైల్ స్టేడియం
- February 07, 2022
ఖతార్: FIFA ప్రపంచ కప్ 2022కి ఆతిథ్యం ఇవ్వడానికి ఖతార్ సన్నద్ధమవుతోంది. వరల్డ్ కప్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చే లుసైల్ స్టేడియాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. FIFA వరల్డ్ కప్ 2022కి అర్హత సాధించిన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా జెండాలను ఎగురవేసే కార్యక్రమంలో ఈ మేరకు సుప్రీం కమిటీలో మార్కెటింగ్, కమ్యూనికేషన్స్, ఈవెంట్ ఎక్స్ పీరియన్స్ డిప్యూటీ జనరల్ మిస్టర్ ఖలీద్ అల్ మౌలావి స్పష్టం చేశారు. టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఖతార్ సంసిద్ధంగా ఉందని అల్ మవ్లావి అన్నారు. ఈ సందర్భంగా FIFA 2022కి అర్హత సాధించినందుకు కొరియా,ఇరాన్‌లకు అభినందనలు తెలియజేశాడు. ఇప్పటి వరకు ఆతిథ్య దేశం ఖతార్‌తో సహా దాదాపు 15 దేశాలు FIFA ప్రపంచ కప్ 2022కి అర్హత సాధించాయి. మొదటి దశ టిక్కెట్ విక్రయం గత నెలల్లో ప్రారంభమయ్యాయి. ఈవెంట్ కోసం 1.5 మిలియన్ల మంది అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. నవంబర్ 21–డిసెంబర్ 18 వరకు జరగనున్న ఫుట్‌బాల్ పోటీలు జరుగనున్నాయి. ఇంకా తేదీని నిర్ణయించనప్పటికీ, లుసైల్ స్టేడియం ప్రారంభోత్సవానికి వేదిక సిద్ధమైంది. మిగతా ఏడు స్టేడియాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..