'పోస్ట్ కోవిడ్ క్లినిక్' ని ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్

- February 07, 2022 , by Maagulf
\'పోస్ట్ కోవిడ్  క్లినిక్\' ని  ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్

*కోవిడ్ వల్ల దీర్ఘ కాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రత్యేక 'పోస్ట్ కోవిడ్  క్లినిక్' (POST COVID CLINIC) ని  ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్*

హైదరాబాద్: కోవిడ్ వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఒకే చోట పరిష్కారం. ఈ క్లినిక్ ని మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ చే ప్రాంభించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మెడికవర్ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది  మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ "కోవిడ్ మహమ్మారి చేసిన విలయతాండవం ఎన్నో జీవితాలను చిదిమేసింది . మన జీవనాన్ని తారుమారు చేసింది. కరోనా వల్ల మన జీవనవిధానం పూర్తిగా మారిపోయింది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు . మొదటి వేవ్ లో కరోన పెద్దగా ప్రభావం చూపలేకపోయినా  రెండవ వేవ్ లో మాత్రం  ఉగ్రరూపం  దాల్చి  కొన్ని లక్షల చావులకి కారణమయింది. ఇది ఇంతతితో ఆగిపోలేదు , మళ్ళి మూడవ వేవ్ ఓమిక్రాన్ అంతగా ప్రభావం చూపకపోయినా చాలామంది దీని బారిన పడ్డారు. జనసమూహం ఎక్కువ ఉండే ప్రదేశాలలోనే కరోనా అతివేగంగా పంజా విసురుతుంది. జన సమూహం ఎక్కువగా ఉన్నచోట మనం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మనం దీని బారిన పడతాం" అని అన్నారు.

ఈ సందర్భంగా సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రఘుకాంత్ మాట్లాడుతూ "కోవిడ్ వచ్చిన చాలామందిలో దీర్ఘకాలిక సమస్యలు అనగా అలసట, నిద్రలేమి, వాసన/రుచి కోల్పోవడం, నిరంతర దగ్గు, శ్వాస ఆడకపోవుట, ఛాతి నొప్పి, గుండె దడ, తల తిరగడం, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి సమస్యల వల్ల వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్టర్స్ ని సంప్రదించాలి కూడా తెలియడం లేదు. దానివల్ల ఒక్కక్కసారి ఇతర అవయవాలు పాడవటం జరుగుతున్నది. దానికోసం వాళ్ళు ఎంతో ఖర్చు చేస్తున్నారు. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం అందించేందుకే ఈ కేంద్రాన్ని ప్రారంభించటం జరిగింది" అని అన్నారు.

అలాగే జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి కాంత్ రెడ్డి మాట్లాడుతూ "కోవిడ్ వచ్చి వెళ్ళాక చాలామందికి దీర్ఘకాలిక సమస్యలు అనగా షుగర్ లెవెల్స్ పెరగడం మరియు ఇతర సమస్యలు ఎన్నో వస్తున్నాయి. ఈ పోస్ట్ కోవిడ్  క్లినిక్ ప్రారంభించడం ముఖ్య ఉద్దేశం పేషెంట్స్ కి  ఒకే చోట అన్ని సమస్యలు వివిధ డాక్టర్స్చే పరిష్కరించబడతాయి. దీని ద్వారా వాళ్ళ సమస్యలకి ఒకే చోట పరిష్కారం మరియు వాళ్ళ యొక్క సమయం వృధాకాకుండా, ఖర్చు కూడా తగ్గుతుంది" అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com