కువైట్ లేబర్ మార్కెట్లో మొదటి ప్లేస్ లో ఈజిప్షియన్లు

- February 08, 2022 , by Maagulf
కువైట్ లేబర్ మార్కెట్లో మొదటి ప్లేస్ లో ఈజిప్షియన్లు

కువైట్ లేబర్ మార్కెట్లో మొదటి ప్లేస్ లో ఈజిప్షియన్లు

కువైట్: కువైట్ లో ఇండియన్, కువైట్ లేబర్ ఫోర్స్ ని అధిగమించి ఈజిప్టు లేబర్ ఫోర్స్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సెప్టెంబరు 2021 డేటాను రిలీజ్ చేసింది. మొత్తం 456,600 మంది ఈజిప్టు మేల్-ఫీమేల్ కార్మికులు కువైట్ లో పనిచేస్తున్నారు. మొత్తం లేబర్ మార్కెట్ లో ఈజిప్షియన్ల వాటా 24% గా ఉంది. తర్వాతి స్థానాల్లో భారతీయ కార్మికులు 23.7%(451,300), కువైట్ కార్మికులు 22.3%(424,000) చొప్పున కార్మికులు పనిచేస్తున్నారు. బంగ్లాదేశ్ కార్మికులు మొత్తం 161,100(8.5%) మందితో నాల్గవ స్థానంలో ఉండగా.. ఆ తరువాత పాకిస్తాన్ కార్మికులు మొత్తం 70,300 (3.7%), ఫిలిపినో కార్మికులు మొత్తం 66,000 (3.5%), సిరియన్లు 63,200 (3.3%) చొప్పున కువైట్లో ఉపాధి పొందుతున్నారు. నేపాలీలు 2.1% (40,100), జోర్డానియన్లు 1.3% (25,200), ఇరానియన్లు 1.1%(20,300), ఇతర జాతీయుల సంఖ్య 6.6%(125,100) చొప్పున ఉన్నట్లు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com