ఆసియాలోనే తొలిసారిగా మెటావర్స్ లో వెడ్డింగ్ రిసెప్షన్..

- February 08, 2022 , by Maagulf
ఆసియాలోనే తొలిసారిగా మెటావర్స్ లో వెడ్డింగ్ రిసెప్షన్..

నేటి కాలంలో పెళ్ళిళ్లు కళ్లు చెదిరేలా జరుగుతున్నాయి. అయితే కరోనా పరిస్థితుల వల్ల వివాహాలు వినూత్నంగా వర్చువల్‌ పద్ధతిలో చేయడం చూస్తున్నాం. ఈ కోవలోకే మరో వివాహ వేడుక చేరింది. కోవిడ్‌ నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యతోనే తమిళనాడుకు చెందిన ఓ జంట వివాహం చేసుకుంది. కానీ మ్యారేజ్‌ రిసెప్షన్‌ని మాత్రం మెటావర్స్‌ టెక్నాలజీ సహాయంతో అంగరంగ వైభవంగా జరుపుకుంది. మెటావర్స్ టెక్నాలజీతో ఆసియా ఖండంలో జరిగిన తొలి వెడ్డింగ్ రిసెప్షన్ ఇదే కావడం విశేషం.

శివలింగపురం గ్రామానికి చెందిన దినేష్‌, జనగనందిని వివాహం ఈనెల 6న జరిగింది. దినేష్ ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌గా పని చేస్తున్నాడు. జనగనందిని సాప్ట్‌వేర్‌ డెవలపర్‌గా పని చేస్తోంది. ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం అయ్యారు. ప్రేమలో పడి పెద్దలను వివాహానికి ఒప్పించారు. వివాహం తర్వాత అనంతరం రిసెప్షన్‌ వేడుకను మాత్రం వీరు 3డీ టెక్నాలజీ సాయంతో జరుపుకున్నారు. ఈ టెక్నాలజీ సహాయంతో ఎక్కడో ఉన్న ఓ వ్యక్తి.. మన ముందున్నట్టు.. మాట్లాడుతున్నట్టుగా ఊహాజనితంగా ఉంటుంది. అందుకే వరుడు దినేష్‌ ఈ టెక్నాలజీ సహాయంతో తన మ్యారేజ్‌ రిసెప్షన్‌ ఎంత గ్రాండ్‌గా ఉండాలని కోరుకున్నాడో.. అచ్చం అదే తరహాలో నిర్వహించుకున్నాడు.

రియల్‌గా రిసెప్షన్‌ ఎలా జరుగుతుందో అచ్చం అలానే వర్చువల్‌గా మోటావర్స్‌ మ్యారేజ్‌ రిసెప్షన్‌ జరిగింది. అతిథులను ఆహ్వానించడం, పాట కచేరీ, విందు భోజనాలనాలు, బంధుమిత్రుల ముచ్చట్లు, వధూవరుల వస్త్రాలంకరణ అన్నీ కూడా మన కళ్లెదుట ఎలా జరుగుతుందని ఊహిస్తామో.. 3డీ టెక్నాలజీ సహాయంతో అలానే క్రియేట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com