సీఎం జగన్ తో మరోసారి భేటీ కానున్న మెగాస్టార్ చిరంజీవి
- February 08, 2022
అమరావతి : సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి మరోసారి భేటీ కానున్నారు. ఈనెల 10వ తేదీన ముఖ్యమంత్రిని ఆయన కలవనున్నారు. చిరంజీవితో పాటు మరో ఐదుగురు సినీ ప్రముఖులు సీఎంతో సమావేశం కానున్నారు. టికెట్ ధరలతో పాటు, సినీ పరిశ్రమ సమస్యలపై వీరు చర్చించనున్నారు. వాస్తవానికి ఈరోజు జగన్ తో భేటీ కావాలని చిరంజీవి భావించారు. అయితే ఇండస్ట్రీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో సమావేశం 10వ తేదీకి వాయిదా పడింది.
నెల రోజుల వ్యవధిలో జగన్ తో చిరంజీవి భేటీ కానుండటం ఇది రెండో సారి. జనవరి 13న తాడేపల్లిలోని జగన్ నివాసానికి చిరంజీవి వెళ్లారు. అప్పుడు ఆయన సింగిల్ గానే వెళ్లడం తెలిసిందే. ఈ సారి సమావేశం తర్వాత ఇండస్ట్రీ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని అందరూ ఆశాభావంతో ఉన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..