తిరుపతిలో మోహన్‌బాబు సినీ అకాడమీ
- February 08, 2022
తిరుపతిలో ఈ ఏడాది మోహన్‌బాబు యూనివర్సిటీ ప్రారంభం కానుంది. ఇందులో మోహన్‌బాబు సినీ అకాడమీ కూడా ఉంటుందని మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలియజేశారు.
మోహన్‌బాబు సినీ అకాడమీలో సినిమా రంగంలోని అన్ని విభాగాల స్థానికులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. సినీ పరిశ్రమలో 20 శాతం మంది చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారని, ఇది గర్వించదగ్గ విషయమని మంచు విష్ణు పేర్కొన్నారు.
మా అసోసియేషన్ తరఫున నిర్మించే 'మా' బిల్డింగ్ గురించి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తామని మంచు విష్ణు తెలిపారు. అలాగే మోహన్ బాబు ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటు చేయబోయే స్టూడియో గురించి కూడా త్వరలో వివరాలు ప్రకటిస్తామన్నారు. మూవీ టికెట్ రేట్ల విషయంలో ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని మంచు విష్ణు పేర్కొన్నారు. ఈ విషయంలో తన పర్సనల్ ఒపీనియన్ చెప్పడం సరికాదన్నారు. చిరంజీవితో పాటు బాలకృష్ణ, నాగార్జున, మోహన్‌బాబు, వెంకటేష్‌లాంటి లెజెండరీ నటులంతా తమకు ఆదర్శమన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..