వర్కర్ వీసా అప్రూవల్: ఇకపై నిమిషాల వ్యవధిలోనే.!
- February 09, 2022
దోహా: మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఫాస్ట్ ట్రాక్ ఎలక్ట్రానిక్ సర్వీస్ విధానం ద్వారా లేబర్ మార్కెట్ అవసరాల్ని తీర్చనుంది. వీసా అప్రూవల్ ఇకపై నిమిషాల వ్యవధిలోనే జరగనుంది. విదేశాల నుంచి ఖతార్ వీసా పొందేందుకోసం ఈ ఎలక్ట్రానిక్ సేవను అందుబాటులోకి తెస్తున్నారు. లేబర్ చట్టానికి అనుగుణంగా మాత్రమే ఆయా కంపెనీలు ఈ సౌకర్యాన్ని పొందే వీలుంది. కొత్త అలాగే ఇప్పటికే వున్న సంస్థలు తమ కార్యకలాపాల్ని మరింత పెంచుకునేందుకు ఈ సౌకర్యం ఉపయోగపడనుంది. కొత్ లేబర్ మార్కెట్ అనుమతుల కోసం స్మార్ట్ కార్డ్ అవసరం. సంస్థ ఐడెంటిటీని వెరిఫై చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. నేషనల్ అథెంటికేషన్ సిస్టమ్‌లోకి యాక్సెస్ పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. కాంటాక్ట్ సమాచారం సహా పలు వివరాల్ని పొందుపర్చాలి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..







